NTV Telugu Site icon

Mayank Agarwal: హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొడుతున్న ఐపీఎల్ అన్‌సోల్డ్ ప్లేయర్

Mayank

Mayank

Mayank Agarwal: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఫామ్‌తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాను మూడు వరుస మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు సాధించి సెలెక్టర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టీమిండియాలో చోటు దక్కించుకునే క్రమంలో చాలా కష్టపడుతున్న ఈ ఆటగాడు, ఈ ట్రోఫీలో తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన రౌండ్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 104 బంతుల్లో 124 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన మయాంక్ ఆ తర్వాత వేగంగా పరుగులు సాధించాడు. దానితో కర్ణాటక జట్టు ఈ మ్యాచ్‌లో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.

Also Read: Healthy Resolution: కొత్త ఏడాదిలో ఆరోగ్యం కోసం ఈ రిజల్యూషన్ తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

ఈ సెంచరీకి ముందు అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 45 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేయగా, పంజాబ్‌తో మ్యాచ్‌లో 127 బంతుల్లో అజేయంగా 139 పరుగులు సాధించాడు. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనూ 47 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన మయాంక్, కర్ణాటక జట్టు కోసం మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకుంటున్నాడు. ఇన్ని పరుగులు చేస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో మయాంక్ అగర్వాల్‌ను ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో భాగంగా ఉన్నప్పటికీ, కేవలం 4 మ్యాచ్‌లు ఆడే అవకాశం మాత్రమే లభించింది. ఆ తర్వాత అతడిని విడుదల చేయాలని హైదరాబాద్ జట్టు నిర్ణయించింది. ఈసారి మెగా వేలంలో కోటి రూపాయల బేస్ ధరతో పాల్గొన్నప్పటికీ, మయాంక్‌ను ఏ జట్టు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో తనను ఏ జట్టు కొనుగోలు చేయనప్పటికీ, మయాంక్ అగర్వాల్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు విజయాలు అందిస్తూ దక్కని గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. ఈ ఫామ్ కొనసాగిస్తే మళ్లీ టీమిండియాలో చోటు సంపాదించే అవకాశం కల్పించుకోవచ్చని ఆశిస్తున్నాడు.

Show comments