NTV Telugu Site icon

Mayapetika : 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటిన మాయా పేటిక..

Whatsapp Image 2023 09 19 At 10.46.44 Pm

Whatsapp Image 2023 09 19 At 10.46.44 Pm

రీసెంట్ గా థియేటర్లలో విడుదల అయి అంతగా ఆకట్టుకోలేని సినిమాలు  ఓటీటీ లో దుమ్మురేపుతున్నాయి. రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. గత వారం ఓటీటీలో విడుదల అయిన రామబాణం, భోళాశంకర్‌ సినిమా లకు డిజిటల్ స్ట్రీమింగ్ లో సూపర్‌ రెస్పాన్స్‌ వస్తుంది.ఈ రెండు సినిమా లు థియేటర్స్ లో తీవ్రంగా నిరాశపరిచాయి.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరొక సినిమా వచ్చి చేరింది. బేబీ సినిమా తో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న విరాజ్ అశ్విన్‌ హీరోగా నటించిన సినిమా మాయా పేటిక. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. మేశ్‌ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో సునీల్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, హిమజ, శ్యామల తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరత్ చంద్రారెడ్డి, తారక్‍నాథ్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. అలాగే గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు.

జూన్‌ 30వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేక పోయింది.. కాన్సెప్ట్‌ బాగున్నా కానీ సరిపడా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో పాటు ఈ మధ్య రీరిలీజుల ట్రెండ్‌ కూడా కొనసాగుతుండడంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.థియేటర్లలో అంతగా ఆకట్టుకోని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో రికార్డు వ్యూస్‌ ను సొంతం చేసుకుంటోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా మాయా పేటిక డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్‌ 15 నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీ లో మంచి ఆదరణ దక్కించుకుంటోంది. తాజాగా మాయాపేటిక ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 25 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను దాటేసింది. అదికూడా కేవలం నాలుగురోజుల్లోనే. ఈ విషయాన్ని ఆహా సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది . ‘హీట్ ఎక్కిపోతుంది. 25 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ అంటే అంతేగా మరి’ అంటూ మాయాపేటిక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది

https://x.com/ahavideoIN/status/1704084277657268466?s=20