NTV Telugu Site icon

Vini Raman: టీమిండియా అభిమానులపై మ్యాక్స్వెల్ భార్య ఆగ్రహం.. తీవ్ర పదజాలంతో విసుర్లు

Maxwell

Maxwell

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ భార్య వినీ రామన్‌పై దుర్భాషలాడారు. దీంతో.. భారత క్రికెట్ అభిమానులపై విని రామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు పెట్టింది.

Read Also: PM MODI: ఓటమి బాధలో టీమిండియా ఆటగాళ్లు.. డ్రెసింగ్ రూమ్కు వెళ్లి ఓదార్చిన ప్రధాని

“ఉన్నతంగా ప్రవర్తించండి. నేను ఇలా చెబుతున్నానని నమ్మలేకపోతున్నాను. మీరు భారతీయులు అయి ఉండవచ్చు. కానీ మీరు పుట్టి పెరిగిన దేశాన్ని కూడా గౌరవించండి. ముఖ్యంగా మీ భర్త టీమ్​ను, మీ బిడ్డకు తండ్రిని. శాంతంగా ఉండండి.. మీ ఆగ్రహాన్ని ప్రపంచ సమస్యలపై చూపించండి” అని విని రామన్ తెలిపింది.

Read Also: APSRTC: డోర్ డెలివరీకి ఆర్టీసీ కార్గో సేవలు.. ప్రజల ఆదరణతోనే ఆదాయం

ఆదివారం ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్​కప్​గెలిచిన తర్వాత.. విని రామన్ ఆ దేశానికి సపోర్ట్​చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే.. వినిరామన్​ తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. ఆమే పుట్టిపెరిగింది ఆస్ట్రేలియాలో. గ్లెన్​ మ్యాక్స్​వెల్, వినిరామన్​ 2022 మార్చి 18న క్రిస్టియన్​ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మార్చి 27 చెన్నైలో తమిళ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. గత సెప్టెంబర్​లో విని రామన్​ మగబిడ్డకు జన్మనిచ్చింది.