Master Card Users to Book World Cup 2023 Tickets From August 24: త్వరలో భారత్ వేదికగా జరనున్న వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిమానులకు శుభవార్త అందించింది. మెగా టోర్నీ టిక్కెట్లు ‘బుక్‌మై షో’లో బుకింగ్ చేసుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. ప్రపంచకప్ 2023 కోసం ‘బుక్‌మై షో’ను తమ టికెటింగ్ భాగస్వామిగా బుధవారం అధికారికంగా ప్రకటించింది. ప్రధాన, వామప్ మ్యాచ్‌లు కలిపి మొత్తంగా 58 మ్యాచ్‌ల టికెట్లను బుక్‌మై షోలో కొనుగోలు చేయవచ్చు.
భారత్ మినహా మిగతా జట్ల వామప్ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లు ఆగష్టు 25 నుంచి బుక్‌మై షోలో అందుబాటులో ఉండనున్నాయి. అయితే బీసీసీఐ స్పాన్సర్లలో ఒకరైన ‘మాస్టర్ కార్డ్’ వినియోగదారులకు మాత్రం ఒకరోజు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. నేటి రాత్రి 8 గంటల నుంచి మాస్టర్ కార్డ్ వినియోగదారులు బుక్ చేసుకునే వీలుంటుంది. అయితే భారత్ ఆడే మ్యాచులకు ఈ మాస్టర్ కార్డ్ వర్తించదు.
Also Read: Chandrayaan 3: చంద్రుడి ఉపరితలంపై ముందుగా బ్యాటింగ్ చేయాల్సిందే!
భారత్ ఆడే వామప్ మ్యాచ్‌లకు ఈ నెల 30 నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. ఇక భారత్ ఆడే ప్రధాన మ్యాచ్‌లకు ధపాలుగా టిక్కెట్లు విడుదల చేయనున్నారు. చెన్నై, ఢిల్లీ, పుణేలో భారత్ ఆడే మ్యాచ్‌లకు ఆగస్టు 31 నుంచి.. ధర్మశాల, లక్నో, ముంబైలో ఆడే మ్యాచ్‌లకు సెప్టెంబర్ 1 నుంచి.. బెంగళూరు, కోల్‌కతాలో భారత్ ఆడే మ్యాచ్‌లకు సెప్టెంబర్ 2 నుంచి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మరోవైపు సెమీ ఫైనల్, ఫైనల్‌కు సెప్టెంబర్ 15న టిక్కెట్స్ విడుదల చేయనుంది. ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
🚨 NEWS 🚨 BCCI announces BookMyShow as Ticketing Platform for ICC Men’s Cricket World Cup 2023. #CWC23
More Details 🔽 https://t.co/HKgat0A5bB
— BCCI (@BCCI) August 23, 2023