NTV Telugu Site icon

South Korea: కార్చిచ్చు విధ్వంసం.. 24కు చేరిన మృతుల సంఖ్య..

South Korea

South Korea

దక్షిణ కొరియాలో కార్చిచ్చు అంతకంతకూ పెరిగి విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. బుధవారం మంటల్లో చిక్కుకుని 24 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో జనాలకు తీవ్ర గాయాలయ్యాయి. అంగ్‌డాంగ్, ఉసియాంగ్, సంచేయాంగ్, ఉల్సాన్‌ ప్రాంతాలపై కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. 43వేలకు పైగా ఎగరాల్లో మంటలు వ్యాపించాయి. ఇప్పటికే దాదాపు 300లకు పైగా నివాసాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

READ MORE: RR vs KKR : కోల్‌కతా నైట్ రైడర్స్ ఆధిపత్యం – రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం

మరోవైపు రక్షణ చర్యలు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సహాయ చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన ఉసియాంగ్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మంటల్లో అనేక పూరాతన కట్టడాలు నాశనమవుతున్నాయి. ఉసియాంగ్‌లోని 7వ శతాబ్దానికి చెందిన పురాతన దేవాలయం ధ్వంసమైంది. దక్షిణాన ఉన్న చియోంగ్‌సాంగ్‌ జైలు నుంచి 500 మంది ఖైదీలను సురక్షితంగా తరలించారు. ఈ కార్చిచ్చుపై ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్‌ డక్‌- సూ స్పందించారు. ఇది అత్యంత ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రస్తుతం 130 హెలికాప్టర్లు, 4650 మంది సైనికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

READ MORE: David Warner : ఆ బూతులు వింటే మీరు చెవులు మూసుకుంటారు.. వార్నర్ రియాక్షన్