Site icon NTV Telugu

TDP Mahanadu: అపోహలు చెదరగొట్టిన మహానాడు.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి..!

Tdp Mahanadu

Tdp Mahanadu

TDP Mahanadu: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమం అపూర్వ విజయాన్ని సాధించిందదని, రాయలసీమకు చెందిన 24 నియోజకవర్గాల నుండి వచ్చిన నాలుగు లక్షల మందికి పైగా టీడీపీ శ్రేణుల ఉత్సాహభరితంగా పాల్గొనడం ఈ విజయానికి నిదర్శనమని, ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సంవత్సర కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి సాక్ష్యంగా నిలిచిందని ఆయన అన్నారు.

Read Also: Gaddar Awards : 2014 నుంచి 2023వరకు ఉత్తమ సినిమాలు ఇవే..

ఈ స్థాయిలో ప్రజా సమీకరణ జరగడం చంద్రబాబు నాయుడు నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం నెలకొన్నదని.. కడప ప్రజలు అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసారని ఆయన తెలిపారు. మహానాడు విజయానికి కృషి చేసిన మంత్రులు, శాసనసభ్యులు, టీడీపీ శ్రేణులు, ఉమ్మడి కడప జిల్లా నాయకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రత్యేకించి కడప జిల్లాకు నాలుగు సంవత్సరాలలో అమలు చేయబోయే అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి, కడప జిల్లాను అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తాం అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Khaleja Re Release: అరె ఏంట్రా ఇది.. సినిమా హాలులోకి పామును పట్టుకొచ్చిన మహేష్ అభిమాని..!

Exit mobile version