NTV Telugu Site icon

Hyderabad: భారీగా కల్తీ నిత్యవసర వస్తువుల పట్టివేత

Hyd

Hyd

Hyderabad: హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో భారీగా కల్తీ నిత్యవసర వస్తువుల తయారీని పోలీసులు గుర్తించి దాడి నిర్వహించారు. రాజేంద్రనగర్‌ ఎస్ఓటీ బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొని 20 రకాల కిరాణా వస్తువులను స్వాధీనం చేసుకుంది. కల్తీ వ్యాపారస్తులు ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి పలు నిత్యవసర వస్తువులను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేటుగాళ్లు ప్రజల్లో ఎక్కువగా వినియోగించే ప్రముఖ బ్రాండ్లను టార్గెట్ చేసి కల్తీ ఉత్పత్తులను తయారు చేశారు. వీటిని అసలు బ్రాండ్‌ల ప్యాకింగ్‌లోనే మార్కెట్‌లోకి వదిలి వినియోగదారులను మోసం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న కల్తీ ఉత్పత్తులలో ప్రధానంగా ఈ వస్తువులు ఉన్నాయి.

Read Also: SLBC: 19వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.. రోబోలను వినియోగించేందుకు రంగం సిద్ధం

బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ టీ పౌడర్, బ్రూక్ బాండ్ తాజ్‌మహల్‌ టీ పౌడర్, వీల్ సర్ఫ్, ప్యార్ షూట్ కొబ్బరి నూనె, కంఫర్ట్ కండీషనర్, క్లినిక్ ప్లస్ హెయిర్ షాంపూ, కార్న్ పౌడర్, పాండ్స్ బాడీ లోషన్ ఇవి కాకుండా మరికొన్ని ఇతర నిత్యవసర వస్తువులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేటుగాళ్లు అసలు ఉత్పత్తులతో ఏ మాత్రం తేడా తెలియకుండా నకిలీ ప్యాకింగ్‌ను తయారు చేశారు. వినియోగదారులకు అనుమానం రాకుండా ఒరిజినల్ ప్రొడక్ట్స్‌లా మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే, పోలీసులు అనుమానంతో దర్యాప్తు చేపట్టగా ఈ కల్తీ వ్యవహారం బయటపడింది.

Read Also: Jawahar Nagar: జంట హత్యకేసులో ప్రేమికులు అరెస్ట్

రాజేంద్రనగర్‌ ఎస్ఓటీ బృందం ఈ నకిలీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కల్తీ వ్యాపారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.