Site icon NTV Telugu

Hyderabad: పని మనుషులతో జాగ్రత్త?.. వ్యాపారవేత్త ఇంట్లో 2 కిలోల బంగారం, 3 కోట్ల నగదు చోరీ..

Robbery

Robbery

కాచిగూడలో వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడి జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చి డబ్బు నగలు దోపిడీ చోటు చేసుకుంది. వ్యాపారవేత్త హేమ రాజ్ ఇంట్లో రెండు కిలోల బంగారం ఆభరణాలు మూడు కోట్ల నగదు చోరీ చేశారు. పని మనుషులు.. వ్యాపారవేత్త దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. హేమ్రాజ్ దంపతులు మత్తుమందుతో కూడిన భోజనం తిని అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

READ MORE: CM Chandrababu: నేడు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు.. ఢిల్లీ షెడ్యూల్ ఇదే!

వాళ్లు స్పృహ కోల్పోయిన వెంటనే ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, మూడు కోట్ల నగదు దోచుకెళ్లారు. ఉదయం వాకింగ్ కి హేమ రాజు రాకపోవడంతో స్నేహితులు ఇంటికి వచ్చారు. ఇంట్లో అపస్మార్క స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను ఆసుపత్రిలో చేర్పించారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లిన నేపాలి దంపతుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. కాగా.. పని మనుషులను ఎంచుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

READ MORE: Hyderabad: పని మనుషులతో జాగ్రత్త?.. వ్యాపారవేత్త ఇంట్లో 2 కిలోల బంగారం, 3 కోట్ల నగదు చోరీ..

Exit mobile version