Fire Accident: ఫ్యూచర్ సిటీలో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ చైర్ల తయారీ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని నందిగామ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ప్లాస్టిక్ చైర్ల తయారీ కంపెనీలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలో వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసిపడి సమీపంలోని ప్లాస్టిక్ కుర్చీలకు అంటుకోవడంతో ఈ ప్రమాదం మొదలైంది. ప్లాస్టిక్ సామగ్రి భారీగా నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లోనే కంపెనీ అంతటా వేగంగా వ్యాపించాయి.
దట్టమైన నల్లటి పొగతో పాటు మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదాన్ని గుర్తించిన కంపెనీ కార్మికులు వెంటనే అప్రమత్తమై ప్రాణభయంతో హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు రెండు ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తూ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read
- Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
- YS Jagan: చంద్రబాబు అభివృద్ధి ప్రచారం ఉత్తదే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ విమర్శలు..
- Rasgulla bomb: రసగుల్లా అని నోట్లో పెట్టుకుని కొరికాడు.. బాంబు పేలి వ్యక్తి మృతి..
మరోవైపు నందిగామ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్థానికులను ప్రమాద స్థలానికి దూరంగా ఉంచుతూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఏమైనా ప్రాణనష్టం జరిగిందా లేదా కార్మికులు ఎవరైనా లోపల చిక్కుకున్నారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
-
Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!