Site icon NTV Telugu

Fire Accident: గండిపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 25 కార్లు దగ్ధం

Fire

Fire

రంగారెడ్డి జిల్లా గండిపేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కార్ల గోదాంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీప ప్రాంతాలు నల్లటి పొగతో దట్టంగా కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఇదిలా ఉంటే గోదాం పూర్తిగా దగ్ధమైంది.. ఈ ప్రమాదంలో 25 కార్లు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూటే కారణంగా భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tillu Square: నాగవంశీ సంచలన నిర్ణయం.. మీడియాకి నో షోస్!

స్థానికులు సమాచారం అందించగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. మరోవైపు ఎండలు ఎక్కువగా ఉండడంతో త్వరగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఇంకోవైపు అగ్నికీలలు ఎగిసిపడడంతో ఒకదాని వెంట మరొకదానికి మంటలు అంటుకుని కార్లు తగలబడ్డాయి. భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న అధికారులు నష్టం అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

 

Exit mobile version