Site icon NTV Telugu

Military Plane Crashed: ఘోర ప్రమాదం.. కూలిన సైనిక విమానం.. 110 మంది సైనికులు!

Colombian Military Plane Ca

Colombian Military Plane Ca

కొలంబియాలోని మారుమూల దక్షిణ అమెజాన్ ప్రాంతంలో 110 మంది సైనికులతో వెళ్తున్న సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. కొలంబియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్రమాదంలో లాక్‌హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130 విమానం కూలిన వెంటనే మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. పెరూ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్యూర్టో లెగుయిజామో పట్టణం దగ్గర సోమవారం సైనికులను తీసుకువెళ్తున్న విమానం కూలిపోయింది. కనీసం 34 మంది మృతి చెందినట్లు సమాచారం.

Also Read:STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

స్థానిక మీడియా సంస్థ బ్లూరేడియో ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 110 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. రాయిటర్స్ ప్రకారం, హెర్క్యులస్ సి-130 విమాన శిథిలాల నుండి సుమారు 57 మందిని సజీవంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. సైనిక విమాన ప్రమాదంపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఆందోళన వ్యక్తం చేశారు. 1950లలో తొలిసారిగా ప్రవేశపెట్టిన హెర్క్యులస్ సి-130, 1960ల చివర నుండి కొలంబియాతో సహా ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ట్రాన్స్ పోర్ట్ యూనిట్స్ లో ఒక కీలక భాగంగా ఉంది. కొన్ని విమానాలను కాలానుగుణంగా ఆధునీకరించినప్పటికీ, పాతబడిన వాటి గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Exit mobile version