Site icon NTV Telugu

Fire Accident: ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం.. విద్యుత్ సబ్‌స్టేషన్ దగ్ధం

Fire

Fire

ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లోని కోటాలో విద్యుత్ పంపిణీ సంస్థలో మంటలు అంటుకుని పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమీప ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Posani Krishna Murali: వాలంటీర్ల అంశంపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు మంటల్లో కాలిపోతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో మంటలు భారీగా అంటుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మంటలు విస్తరించడంతో సమీప నివాస ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా? ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది అధికారులు ఇంకా ఏమీ వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న ఇళ్లల్లోని ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. పలువురు భయంతో పరుగులు తీస్తున్నారు. ఓ వైపు అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్న అదుపులోకి రావడం లేదు.

ఇది కూడా చదవండి: Harish Rao: మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది..

 

Exit mobile version