NTV Telugu Site icon

Explosion In IOCL: ఐఓసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు

Iocl

Iocl

Explosion In IOCL: గుజరాత్‌లోని వడోదరలోని కోయలీ ప్రాంతంలోని ఐఓసీఎల్ రిఫైనరీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీలోని స్టోరేజీ ట్యాంక్‌లో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి. దాంతో కొన్ని కిలోమీటర్ల దూరం నుండి పొగలు కమ్ముకున్నాయి. స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు 10 ఫైరింజన్లను వాడారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా సమీపంలోని కంపెనీలు, ఆయా ప్రాంతాలలో గందరగోళం ఏర్పడింది. మంటలు చెలరేగడంతో రిఫైనరీలో ఉన్న ఉద్యోగులను అక్కడి నుంచి తరలించారు.

Also Read: Thummala Nageswara Rao: రైతన్నలను కాంగ్రెస్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది

రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా తీవ్ర గాయాలు అయినట్లు నివేదిక లేదని ట్రాఫిక్ డీసీపీ జ్యోతి పటేల్ తెలిపారు. ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ వాఘేలా మాట్లాడుతూ.. తనకు బాజ్వా సర్పంచ్ అజిత్ పటేల్ నుండి కాల్ వచ్చిందని, అగ్నిప్రమాదం గురించి ఆయన తెలియజేశారన్నారు. నేను రిఫైనరీ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ, వారు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నందున, నేను వారిని టెలిఫోన్‌లో సంప్రదించలేకపోయానని అన్నారు. కొంతమంది గాయపడినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని ఆయన అన్నారు. నివేదిక ప్రకారం, కోయిలీలోని ఐఓసిఎల్ రిఫైనరీలో సాయంత్రం 4 గంటల సమయంలో పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. కొన్ని కిలోమీటర్ల మేర పొగలు కమ్ముకున్నాయి. పేలుడు తర్వాత రిఫైనరీలో ఉన్న ఉద్యోగులను ఖాళీ చేయించారు.

Also Read: Encounter: సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం

Show comments