Fire Accident: స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
- ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఉన్న భంగర్‌వాడిలో.
- భారీ అగ్నిప్రమాదం.
- భారీగా ఎగిసిపడుతున్న మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident In Mumbai: ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఉన్న భంగర్‌వాడిలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. ఘటనా స్థలంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. రాత్రి 8 గంటల సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వాహనాలు అంధేరీ ఈస్ట్‌లోని భంగర్‌వాడి ప్రాంతానికి చేరుకున్నాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. మురికివాడలో ఉన్న గోదాములో మంటలు చెలరేగాయని, దానిని ఆర్పే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారి తెలిపారు.
Read Also: Telangana: జిల్లాలను కమ్మేసిన పొగమంచు.. హెడ్ లైట్ల వెలుతురులో ప్రయాణం..
Also Read
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
ఇది కాకుండా, సెంట్రల్ ముంబైలోని సియోన్ ప్రాంతంలోని రేషన్ కార్యాలయంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. షణ్ముఖానంద హాల్ సమీపంలోని ఫీనిక్స్ రోడ్డులో ఉన్న రేషన్ కార్యాలయంలో రాత్రి 7 గంటల సమయంలో మంటలు చెలరేగాయని ఒక అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ సిబ్బందితో పాటు అగ్నిమాపక బృందం ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పే పని కొనసాగుతోందని ఆయన తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదు. మరోవైపు, ముంబైలోని గోరేగావ్ ఈస్ట్ ప్రాంతంలోని భవనంలోని 30వ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీపావళి కారణంగా దేశ వ్యాప్తంగా అగ్నిప్రమాదలు జరిగాయి.
#WATCH | Mumbai, Maharashtra: Fire broke out in a scrap shop in the Andheri East MIDC area earlier today.
(Source: Mumbai Police) pic.twitter.com/LJhP7nnrAk
— ANI (@ANI) November 2, 2024
తాజావార్తలు
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్‌కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!