Site icon NTV Telugu

Fire Breaks Out: గోరేగావ్ ఫిల్మ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం..!

Fire Breaks Out

Fire Breaks Out

Fire Breaks Out: ముంబైలోని ఫిల్మ్ సిటీలో సోమవారం ఉదయం ఓ సీరియల్ సెట్‌ లో భారీ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదని వారు తెలిపారు. అనుపమాలోని టెంట్ ప్రాంతంలో మంటలు చెలరేగాయని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక దళానికి సమాచారం అందింది. దానితో వెంటనే గోరేగావ్ (తూర్పు) ప్రాంతం లో ఉన్న ఫిల్మ్ సిటీలోని దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరిలో ఉన్న మరాఠీ బిగ్ బాస్ సెట్ వెనుక ఉదయం 6.10 గంటలకు జరిగింది. అయితే అక్కడ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Read Also:Xiaomi Mix Flip 2: 6.85 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 50MP + 50MP కెమెరాలతో విడుదలకు సిద్దమైన షియోమీ మిక్స్ ఫ్లిప్ 2..!

ఇక సంఘటన జరుగుతున్న సమయంలో నాలుగు అగ్నిమాపక యంత్రాలు, అనేక పెద్ద నీళ్ల ట్యాంకర్లను సంఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక చర్యలు జరుగుతున్న ప్రదేశంలో అసిస్టెంట్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ సహా మరో ముగ్గురు స్టేషన్ అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్లు కూడా సమాచారం లేదని ఓ అధికారి తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:Kuberaa : ధనుష్ సినిమాలో నటించేందుకు ఎలా ఒప్పుకున్నావు అని నాగ్ ని అడిగా : చిరంజీవి

Exit mobile version