Site icon NTV Telugu

Fire Accident: జనగామలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన అగ్నికీలలు

Fire Accident

Fire Accident

Fire Accident: జనగామలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని విజయషాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగగా.. షాపింగ్‌మాల్ పూర్తిగా దగ్ధమైంది. పక్కనున్న 5 షాపులకు మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న శ్రీలక్ష్మీ వస్త్ర దుకాణం కూడా పూర్తి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు గంటలు ప్రయత్నించినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.

Read Also: Stampede At Railway Station: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. పలువురికి గాయాలు

ఒకే ఫైర్ ఇంజన్ ఉండడంతో మంటల్ని అదుపులోకి ఫైర్ సిబ్బంది తీసుకురాలేకపోయారు. అనంతరం స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలకుర్తి, ఆలేరు ప్రాంతాల నుంచి ఫైరింజిన్‌లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల స్థానికులు, షాప్‌ నిర్వాహకులు భయాందోళనకు గురవుతున్నారు. పక్కన ఉండే షాప్ నిర్వాహకులు షాపులను ఖాళీ చేస్తున్నారు. రెండు వస్త్ర దుకాణాలు పూర్తిగా దగ్ధం కాగా.. రూ.10 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. తొలుత విజయ షాపింగ్‌మాల్‌లో మంటలు చెలరేగగా.. అనంతరం పక్కనే ఉన్న శ్రీలక్ష్మీ వస్త్ర దుకాణానికి మంటలు వ్యాపించాయి.

 

Exit mobile version