హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉప్పల్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ క్లోస్ చేసే సమయంలో ఈ ఘటన జరిగింది. షాపింగ్ మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు క్షణాల్లో మాల్ మొత్తం వ్యాపించాయి. మాల్ ముందు భాగంలో న్యూ ఇయర్ సందర్భంగా డెకరేట్ చేసిన లైటింగ్ వల్ల తొలుత మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
Read Also: Bab el-Mandeb: బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిలో కార్గో షిప్‌కి సమీపంలో పేలుళ్లు…
అయితే, ప్రమాద సమయంలో షాపింగ్ మాల్ మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లతో గంట సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఉప్పల్ పోలీసులు కూడా అర్థరాత్రి ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాక ఆస్తి, ప్రాణ నష్టం అలాగే ఎవరికైనా గాయాలు అయ్యాయా అనే విషయంపై ఆరా తీశారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా?.. అనేక కారణాలు వ్యక్తంఅవుతున్నాయి. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.