US Mobile Network: టెలికాం సేవల్లో అంతరాయం.. ప్రజలు ఇక్కట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ అనేది మనిషికి నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. తినేటప్పుడు.. పడుకునేటప్పుడు.. ప్రయాణాల్లో.. ఇలా ప్రతి సందర్భాల్లో చేతిలో మొబైల్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టే ఫీలవుతారు. ఛార్జింగ్ లేకపోయినా.. డేటా అయిపోయినా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది అగ్రరాజ్యం అమెరికాలో టెలికాం సేవల్లో తీవ్ర అంతారాయం ఏర్పడింది. అంతే ప్రజలు అయోమయం.. గందరగోళానికి గురయ్యారు.. ఏమైందో.. ఏంటో తెలుసుకునేందుకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి ఆగమాగం అయిపోయారు.
అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం (Cellular Outage) ఏర్పడింది. షికాగో, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్, బ్రూక్లిన్ ప్రాంతాల్లోని వినియోగదారులు సిగ్నల్ సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఏటీ&టీ, వెరిజోన్, టీ-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్ నెట్‌వర్క్‌లలో (Mobile Networks) కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్ అనే నెట్‌వర్క్ ట్రాకింగ్ సైట్ వెల్లడించింది. వినియోగదారులు గురువారం తెల్లవారుజామున సిగ్నల్ సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నింటిలో సమస్య తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఒక్క ఏటీ&టీ కస్టమర్ల నుంచే 31 వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. వెరిజోన్‌కు వెయ్యికి పైగా ఫిర్యాదులు రాగా.. టీ-మొబైల్‌కు చెందిన వినియోగదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. అత్యవసర సేవల కోసం (911) ప్రయత్నించే వారిపైనా దీని ప్రభావం పడినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అయితే ఈ భారీ అంతరాయానికి గల కారణాలు మాత్రం వెల్లడి కావాల్సిఉంది. సైబర్ దాడిపై అనుమానం వ్యక్తంచేస్తూ అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!