Massive Accident : చేవెళ్ళ ఆలూరు గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన లారీ ఫుడ్ పాత్ మీదకి దూసుకెళ్లింది. దీంతో.. ఫుట్ పాత్ మీద కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో..
పదిమందికి పైగా చనిపోయినట్లుగా సమాచారం. ఇదే కాకుండా.. 20 మందికి పైగా గాయపడ్డట్లగా తెలుస్తోంది.
Waqf: ‘‘ముస్లింలు నమాజ్ చేసే ఏ స్థలమైనా వక్ఫ్ ప్రావర్టీనే’’.. తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.
ఈ ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. హుటాహుటిన సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అంతేకాకుండా.. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే.. ప్రమాద జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని ఘటన స్థలంలోనే వదిలి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి, ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mamata Banerjee: హిందువులపై హింస.. యూఎన్‌కి మమతా బెనర్జీ పిలుపు..