తాగిన మత్తులో నిర్లక్ష్యంగా, అతివేగంగా టాటా ఇన్ఫ్రా వ్యాన్ డ్రైవింగ్ చేస్తూ పాదాచరులను, రెండు ద్విచక్ర వాహన దారులను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా… నలుగురికి గాయాలయ్యాయి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ లో… తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ రాజు అతివేగంగా, నిర్లక్ష్యంగా టాటా ఇన్ఫ్రా వ్యాన డ్రైవింగ్ చేస్తూ… పాదచారులపైకి అలాగే రెండు ద్విచక్ర వాహనదారుల పైకి దూసుకెళ్ళడంతో అక్జడికక్కడే సంతోషి(35) అనే మహిళ మృతి చెందింది. 1) సరిత, 2) సర్దార్, 3) అజ్మత్, 4) నర్శింగ్ రావ్ అనే నలుగురుకి గాయాలైయ్యాయి. గాయాలైనవారిని స్దానికులు వెంటనే చింతల్ లోని RNC ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం తెలిసుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాజు మద్యం మత్తులో ఉండి ఏమి జరుగనట్లు ఉండటం గమనార్హం..
Also Read : SA vs ENG: ఇంగ్లాండ్పై సౌతాఫ్రికా ఘన విజయం.. 229 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు
ఇదిలా ఉంటే.. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ ఐ సరితారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సమయంలో చందానగర్ గాంధీ విగ్రహం వద్ద రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని పాదచారిని లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
Also Read : Top Headlines @9PM : టాప్ న్యూస్
