నిజమాబాద్ జిల్లాలో ఎక్సైజ్ విభాగం ఖాళీ అయ్యింది. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ చోటుచేసుకుంది. 201 మంది ఉద్యోగులను ఒకే సారి బదిలీ చేశారు ఉన్నతాధికారులు. నిజమాబాద్ నుంచి ఆదిలాబాద్ కు బదిలీ చేశారు. ఉద్యోగులు ఆదిలాబాద్ లో విధుల్లో చేరారు. జిల్లా పోస్టులను, జోనల్ పోస్టు గా బదిలీల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరాల నియంత్రణ పేరిట ఒకే సారి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. అల్ఫోజలం దందాలో కానిస్టేబుళ్లు ఇన్వాల్వ్ అవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కానిస్టేబుల్ సౌమ్య మృతి పై ఎక్సైజ్ కానిస్టేబుళ్ళు ఆందోళనలు దిగిన విషయం తెలిసిందే. 8ఏళ్లుగా బదిలీల కోసం పోరాడితే.. ఆదిలాబాద్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు
Nizamabad: కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ..
- నిజమాబాద్ జిల్లాలో ఎక్సైజ్ విభాగం ఖాళీ
- కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ
- 201 మంది ఉద్యోగులను ఒకే సారి బదిలీ

Nizamabad