NTV Telugu Site icon

Veera Simha Reddy: యాడజూడు నీదే జోరు.. మొగతాంది నీదే పేరు

Mass Mogudu

Mass Mogudu

Veera Simha Reddy: నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో నటించింది.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన ప్రతి పాటా మాస్ ఆడియన్స్ లోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇటీవల ‘మాస్ మొగుడొచ్చాడే’ అనే మరో పాటను వదిలారు. ‘యాంది రెడ్డి .. యాంది రెడ్డి యాడజూడు నీదే జోరు, తొడలు గొట్టి .. హడలగొట్టి మొగతాంది నీదే పేరు’ అంటూ ఈ పాట మొదలవుతోంది.

Read Also: Balakrishna: బాలయ్య వాచీ చూశారా? దాన్ని ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా?

రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట సాహిత్యం మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మనో – రమ్య బెహ్రా తమ స్వరంతో ఈ పాటకు మరింత హుషారు తీసుకొచ్చారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో కలర్ ఫుల్ సెట్స్ లో చిత్రీకరించిన ఈ పాట, మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్టయింది. సోషల్ మీడియాతో పాటు, యూట్యూబులోనూ ఈ సాంగ్ దుమ్ముదులుపుతోంది. బాలయ్య ద్విపాత్రాభినయం.. పవర్ ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే స్టెప్పులు, ఫ్యాక్షన్ నేపథ్యంలో కొనసాగనున్నట్లు టీజర్ అదిరిపోయింది. రోమాలు నిక్కపుడుచుకునేలా యాక్షన్ సీన్లు చూస్తుంటే మూవీ గ్యారెంటీ హిట్ అని ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు.. సంక్రాంతి సెంటిమెంట్ కూడా తోడవడంతో వారి ఆనందం రెట్టింపు అయింది.. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ బుకింగ్స్ విషయంలో సంక్రాంతి సీజన్‌లో రాబోతున్న మిగతా చిత్రాలకంటే బాలయ్య కాస్త ముందే ఉన్నాడు..రికార్డ్స్ స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి.