Veera Simha Reddy: యాడజూడు నీదే జోరు.. మొగతాంది నీదే పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veera Simha Reddy: నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ సినిమా మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్ తొలిసారి బాలయ్యతో నటించింది.. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు.. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన ప్రతి పాటా మాస్ ఆడియన్స్ లోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇటీవల ‘మాస్ మొగుడొచ్చాడే’ అనే మరో పాటను వదిలారు. ‘యాంది రెడ్డి .. యాంది రెడ్డి యాడజూడు నీదే జోరు, తొడలు గొట్టి .. హడలగొట్టి మొగతాంది నీదే పేరు’ అంటూ ఈ పాట మొదలవుతోంది.
Read Also: Balakrishna: బాలయ్య వాచీ చూశారా? దాన్ని ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట సాహిత్యం మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మనో – రమ్య బెహ్రా తమ స్వరంతో ఈ పాటకు మరింత హుషారు తీసుకొచ్చారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో కలర్ ఫుల్ సెట్స్ లో చిత్రీకరించిన ఈ పాట, మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్టయింది. సోషల్ మీడియాతో పాటు, యూట్యూబులోనూ ఈ సాంగ్ దుమ్ముదులుపుతోంది. బాలయ్య ద్విపాత్రాభినయం.. పవర్ ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే స్టెప్పులు, ఫ్యాక్షన్ నేపథ్యంలో కొనసాగనున్నట్లు టీజర్ అదిరిపోయింది. రోమాలు నిక్కపుడుచుకునేలా యాక్షన్ సీన్లు చూస్తుంటే మూవీ గ్యారెంటీ హిట్ అని ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు.. సంక్రాంతి సెంటిమెంట్ కూడా తోడవడంతో వారి ఆనందం రెట్టింపు అయింది.. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్ బుకింగ్స్ విషయంలో సంక్రాంతి సీజన్‌లో రాబోతున్న మిగతా చిత్రాలకంటే బాలయ్య కాస్త ముందే ఉన్నాడు..రికార్డ్స్ స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..