Site icon NTV Telugu

Mass Jathara: వినాయక చవితికి మాస్ గిఫ్ట్.. థియేటర్లలోకి రవితేజ ‘మాస్ జాతర’..!

Mass Jathara

Mass Jathara

Mass Jathara: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌, పాటల ద్వారా ఇది పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని స్పష్టం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

Read Also: Gaddar Awards: తగ్గేదేలే.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌.. బెస్ట్‌ సినిమాగా కల్కి..!

వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. విడుదల తేదీ సమీపంలో మరో పెద్ద సినిమా లేకపోవడం వల్ల, మాస్ జాతరకు సోలో రిలీజ్ విండో దక్కినట్లయింది. ఇది సినిమాకి భారీ ఆదరణ కలగించడానికి దోహదపడనుంది. ఈ సినిమాలో సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read Also: Gaddar Awards: 14 ఏళ్ల తర్వాత సినిమా అవార్డుల సంబరం.. గద్దర్ పేరుతో సినీ పురస్కారాలు..!

ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్‌ను ఒకేసారి మెప్పించేందుకు దర్శకుడు భాను భోగవరపు ప్లాన్‌ చేసిన సినిమా ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలవుతున్న ఈ మాస్ జాతర ప్రేక్షకులకు పండగలా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Exit mobile version