Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్ ఈవెంట్‌పై వివాదం..
- ఈ కార్యక్రమానికి మద్దతు లేదని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్య..
- మోడీ, బీజేపీ వ్యతిరేకతతోనే ఇలా మాట్లాడుతున్నారన్న యూఎస్ సింగర్ మేరీ మిల్బెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్ ఈవెంట్‌పై వివాదం నెలకొంది. ఇది మన దేశంలోనే కాదు, అమెరికాలో రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. ఆగస్టు 29న జరగనున్న ఈ కార్యక్రమాన్ని ‘‘యూనివర్సిల్ వన్నెస్ సెలబ్రేషన్’’ నిర్వాహకులు పేర్కొన్నారు. మాన్హాటన్లో జరిగే ఈ కార్యక్రమం, హిందూ అమెరికన్ కమ్యూనిటీని ఒకచోట చేర్చి, వారి ఉమ్మడి వారసత్వం, మతాంతర ఐక్యతను ప్రోత్సహించడమే కార్యక్రమ ఉద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు.
అయితే, ఈ కార్యక్రమాన్ని కొన్ని సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. న్యూయార్స్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా ఈ ఈవెంట్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికన్ సింగర్, నటి మేరి మిల్బెన్ మమ్దానీపై తీవ్రంగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనే మాడిసన్ స్వ్కేర్ గార్డెన్ కార్య్రమాన్ని మమ్దానీతో పాటు ఇతర సోషలిస్టులు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీపై వారికి ఉన్న వ్యతిరేకతే అని ఆమె ఆరోపించారు. వారు సోషలిజాన్ని అనుసరిస్తున్నందున క్యాపిటలిజాన్ని అర్థం చేసుకోలేదరి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ సోషలిస్టుల విమర్శలకు సమాధానం చెప్పదు, క్యాపిటలిజానికి సమాధానం చెబుతుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
ఇదే కాకుండా న్యూయార్క్ మేయర్, సోషలిస్టు బృందానికి ఆమె ఒక సూచన కూడా చేశారు. మమ్దానీ, ఆయన మద్దతుదారులు క్యాపిటలిస్టులుగా మారి, నిధులు సేకరించి మాడిసన్ స్వ్కేర్ గార్డెన్ అద్దెకు తీసుకుని మోడీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించుకోవాలని వ్యంగ్యంగా సూచించారు. 2023లో వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్‌లో ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు భారత జాతీయ గీతం ‘జన గణ మన’ ఆలపించిన మేరీ మిల్బెన్ భారత్‌లో మంచి గుర్తింపు పొందారు. ‘ఓం జై జగదీశ్ హరే’ పాటను కూడా ఆమె ఆలపించారు.
వ్యతిరేకిస్తున్న మమ్దానీ..
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం మాన్హాటన్ కార్యక్రమాన్ని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యతిరేకించారు. ఈ కార్యక్రమాన్ని రద్దు గురించి ప్రశ్నించగా.. ‘‘ నేను ఈ ర్యాలీకి మద్దతు ఇవ్వను, అయితే ప్రైవేట్ ఈవెంట్‌ను రద్దు చేసే అధికారం ఉందో లేదో నాకు తెలియదు’’ అని మమ్దానీ అన్నారు. తన కుటుంబం నుంచి తాను నేర్చుకున్న భారతదేశం బహుళత్వం, లౌకికతకు ప్రాధాన్యమిచ్చే దేశమని ఆయన చెప్పారు. భారతదేశానికి చెందిన ప్రతి ఒక్కరికీ సమాన స్థానం ఉండాలనే భావనతో తాను పెరిగానని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..