NTV Telugu Site icon

Maruti Suzuki Offers: మారుతి కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

Maruti Suzuki Offers

Maruti Suzuki Offers

Offers on on Maruti Suzuki Dzire, Maruti Suzuki Swift and Maruti Alto 800: మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఇదే మంచి సమయం. ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతీ సుజుకి’ తన అరేనా లైనప్‌లోని ఎంపిక చేసిన మోడల్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మారుతీ ఆల్టో 800, మారుతీ కే 10, మారుతీ ఎస్ ప్రెస్సో, మారుతీ స్విఫ్ట్, మారుతీ ఎకో, మారుతీ సెలెరియో లాంటి కార్లపై ఆఫర్స్ ఉన్నాయి. కంపెనీ ఏ మోడల్ కారుకి ఎంత డిస్కౌంట్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం.

Maruti Alto 800 Price:
మారుతీ ఇప్పుడు ఆల్టో 800 కారు ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో మిగిలిన ఉన్న కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు మోడల్ బట్టి రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 799 cc ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఆఫర్ సీఎన్జీ మోడల్‌లో కూడా అందుబాటులో ఉంది.

Maruti Suzuki Dzire Price:
మారుతి డిజైర్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వేరియంట్‌లపై రూ. 17,000 ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి . కానీ సీఎన్జీ వేరియంట్‌పై ఎటువంటి తగ్గింపు లేదు. ఇది 90 హెచ్‌పిని ఉత్పత్తి చేసే 1.2 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది.

Maruti Alto K10 Price:
ఆల్టో కే 10 1.0-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఎంపికను కలిగి ఉంది. దీనికి సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది. ఈ కారుపై కంపెనీ రూ. 50,000 నుంచి రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

Maruti Suzuki Swift Price:
మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది. ఈ కారు మాన్యువల్ వేరియంట్‌పై రూ. 45,000, ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 50,000 వరకు తగ్గింపు ఉంది. ఇక సీఎన్జీ వేరియంట్‌పై రూ. 25,000 తగ్గింపు లభిస్తుంది.

Maruti Suzuki S Presso Price:
మారుతి ఎస్ ప్రెస్సో 1.0-లీటర్ ఇంజన్, రెండు గేర్‌బాక్స్‌ల ఎంపికను కలిగి ఉంటుంది. అలాగే సీఎన్జీ ఎంపిక కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ కారుపై రూ. 55,000 నుంచి రూ. 65,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Maruti Suzuki Celerio Price:
మారుతి సెలెరియో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌పై దాదాపు రూ. 65,000 తగ్గింపు, ఆటోమేటిక్ వెర్షన్‌పై రూ. 35,000, సీఎన్జీ వేరియంట్‌పై రూ. 65,000 తగ్గింపు ఉంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.

Maruti Suzuki Wagon R Price:
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అన్ని వేరియంట్లపై రూ. 45,000 నుంచి రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. వ్యాగన్ఆర్ 1.0-లీటర్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో సీఎన్జీ పవర్‌ట్రైన్ ఎంపికను కూడా కలిగి ఉంటుంది.

Maruti Suzuki Eeco Price:
మారుతీ సుజుకి ఎకో ఎమ్‌పివిపై రూ. 39,000 వరకు తగ్గింపు ఉంది. సీఎన్జీ మరియు కార్గో వేరియంట్‌లపై రూ. 38,000 వరకు ఆఫర్‌లు ఉన్నాయి. మారుతి ఎకోలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 73 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5 మరియు 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంది.

Also Read: Heavy Rains: వణకుతున్న ఉత్తరాది.. కుంభవృష్టితో అతలాకుతలం.. 60 మందికి పైగా మృతి

Show comments