Maruti WagonR Price Hike : బడ్జెట్ ఫ్యామిలీ కారు అనగానే ప్రతి ఒక్కరికీ టక్కున గుర్తుకొచ్చే కారు మారుతి వ్యాగన్ఆర్. కానీ కంపెనీ ఈ కారు ధరలను కూడా పెంచేసింది. ఇప్పుడు మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మునుపటి కంటే 15 వేల రూపాయలు ఎక్కువ ధరకు లభిస్తుంది. ఈ ధర వ్యాగన్ఆర్ VXi 1.0 AGS, ZXi 1.2 AGS, ZXi+ 1.2 AGS, ZXi+ AGS డ్యూయల్-టోన్ వేరియంట్‌లకు వర్తిస్తుంది. మిగతా అన్ని వేరియంట్ల ధర రూ. 10,000 పెరిగింది. ధరలో మార్పు కారణంగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 5.64 లక్షల నుండి రూ. 7.47 లక్షల మధ్య ఉండనుంది. మారుతి సుజుకి అరీనా రిటైల్ నెట్‌వర్క్ ద్వారా వ్యాగన్‌ఆర్‌ను విక్రయిస్తుంది. ఇదే నెట్‌వర్క్ డిజైర్, స్విఫ్ట్, ఆల్టో కె10, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఈకో, ఎర్టిగా, బ్రెజ్జాలను కూడా విక్రయిస్తుంది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ లో ఇంజిన్
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ రెండు నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆఫ్షన్లతో రానుంది. ఇందులో 1.0-లీటర్, 1.2-లీటర్ యూనిట్లు ఉన్నాయి. 1.0-లీటర్ యూనిట్ 67bhp, 89Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ యూనిట్ 89 bhp, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 5-స్పీడ్ AMT కి అనుసంధానించబడి ఉన్నాయి. 1.0-లీటర్ ఇంజిన్‌తో సీఎన్జీ ఆఫ్షన్ కూడా వస్తుంది.
Read Also : BattRE LOEV Plus Electric Scooter: మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 90KM రేంజ్
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మైలేజ్?
వాగన్ఆర్ 1.0-లీటర్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 24.35 కి.మీ.ల మైలేజీని, AMT ట్రాన్స్‌మిషన్‌తో 25.19 కి.మీ.ల మైలేజీని అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. వ్యాగన్ఆర్ సీఎన్జీ మోడ్‌లో కిలోకు 33.48 కి.మీ మైలేజీని ఇస్తుంది.
మారుతి సుజుకి మోడల్ ధరలు
మారుతి సుజుకి ఇటీవల తన అరీనా, నెక్సా రిటైల్ నెట్‌వర్క్‌ల ద్వారా లభించే కార్ల ధరలను పెంచింది. మోడల్, వేరియంట్ ఆధారంగా ధర పెరుగుదల రూ. 32,500 వరకు ఉండవచ్చు. కంపెనీ డిజైర్, సెలెరియో, బ్రెజ్జా, బాలెనో వంటి మోడళ్ల ధరలను కూడా పెంచింది. ఇక్కడ పేర్కొన్న కార్లలో దేనినైనా కొనుగోలు చేస్తే దాని ధర 10 లేదా 15 వేల రూపాయల వరకు ఎక్కువగా ఉండవచ్చు.