NTV Telugu Site icon

Maruti e Vitara: అడ్వాన్స్‌డ్ ఫీచర్స్, అద్భుతమైన బ్యాటరీ ప్యాక్‌.. లాంచ్ ఎప్పుడంటే..?

Maruti E Vitara

Maruti E Vitara

మారుతి సుజుకి అనేక కార్ మోడల్స్, పవర్‌ట్రెయిన్ ఎంపికలతో భారతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. అయితే ఇప్పటి వరకు మారుతి ఒక్క ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేయలేదు. ఇతర కంపెనీల నుండి చాలా ఎలక్ట్రిక్ మోడల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మారుతి సుజుకి యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ-విటారాను లాంచ్ చేయబోతున్నారు. 2025 సంవత్సరంలో ఇండియాలో ప్రారంభించనున్నారు. ఈ కారు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రారంభించనున్నారు. అయితే మారుతి ఇ-వితారా ఏ డిజైన్, ఇంటీరియర్స్, పవర్‌ట్రెయిన్, ఫీచర్లతో రానుందో తెలుసుకుందాం..

Read Also: Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత ‘ది సైటానిక్ వెర్సెస్’ పుస్తకాలు విక్రయాలు

డిజైన్
ఇటీవల మారుతి ఇ-వితారా మొదటి టీజర్‌ను విడుదల చేసింది. అందులో ఫ్రంట్ ఎండ్ డిజైన్ చూడవచ్చు. Y- ఆకారపు LED DRLలతో అందించారు. దీని వల్ల కారు మరింత ఆకర్షణీయంగా కనపడుతుంది. అంతే కాకుండా.. గ్లోబల్ మోడల్ బ్లాక్-అవుట్ చంకీ బంపర్, లివర్ బంపర్‌లో ఫాగ్ లైట్లను కలిగి ఉంది. సైడ్ ప్రొఫైల్‌లో 18 అంగుళాల బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్ అందించారు. అంతేకాకుండా.. LED టెయిల్ లైట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్.. ఇ-విటారా వెనుక భాగంలో చూడవచ్చు.

ఫీచర్లు
ఈ కారు గ్లోబల్ వెర్షన్ మాత్రమే ఇండియాకి తీసుకువస్తే.. డ్యూయల్ టోన్ థీమ్, డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఇందులో చూడవచ్చు. ఒక స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ డిస్‌ప్లే కోసం ఉంటుంది. స్పోర్టి 2-స్పోక్ స్టీరింగ్ వీల్.. నిలువుగా-ఆధారిత AC వెంట్‌లను ఈ కారులో చూడవచ్చు. దీని చుట్టూ క్రోమ్ యాక్సెంట్‌లు ఉంటాయి.
అంతే కాకుండా.. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ సీట్ల కోసం వెంటిలేషన్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీని ఈ-వితారాలో చూడవచ్చు.

భద్రతా లక్షణాలు
ప్రయాణీకుల భద్రత కోసం ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో ఆటో-హోల్డ్ మరియు లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఈ ప్రీమియం, అధునాతన భద్రతా ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

బ్యాటరీ ప్యాక్-రేంజ్
ఇ-వితారాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన అదే పవర్‌ట్రెయిన్ ఎంపికతో లాంచ్ కావచ్చు. 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్ ఇందులో చూడవచ్చు. ఈ కారులో ఉంచిన 49 kWh బ్యాటరీ 144 PS పవర్, 189 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా.. 61 kWh బ్యాటరీ ప్యాక్ 174 PS పవర్, 189 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు రేంజ్ గురించి కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 600 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదని సమాచారం.

ధర, ప్రారంభం
మారుతి ఇ విటారా ధరను ఇంకా ప్రకటించలేదు. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 20 లక్షలు ఉండవచ్చని అంచనా. ఈ కారు 2025 సంవత్సరంలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రారంభించనున్నారు. భారతీయ మార్కెట్లో 2025 జనవరి 17న విడుదల కానుంది. ఈ కారు Tata Curvv EV, మహీంద్రా BE 6, MG ZS EV మరియు హ్యుందాయ్ క్రెటా EVలతో పోటీపడుతుంది.

Show comments