Maruthi: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం “రాజా సాబ్”. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని సక్సెస్ పుల్‌గా థియేటర్స్‌లో రన్ అవుతుంది. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో రూ.201 కోట్లకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్‌గా సొంతం చేసుకుంది. డైరెక్టర్ మారుతి టేకింగ్, గ్లోబల్ సినిమా స్థాయిలో ప్రొడ్యూస్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకింగ్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో “రాజా సాబ్” సక్సెస్ హ్యాపీనెస్‌ను ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ మారుతి షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజా సాబ్” సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కుతోందని చెప్పారు. సంక్రాంతి హాలీడేస్ బిగిన్ కాకముందే ఈ సినిమా రూ.200 కోట్ల మార్క్ టచ్ చేయడం హ్యాపీగా ఉందని చెప్పారు. సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో కొత్త పాయింట్ చూపించాం కాబట్టి ప్రేక్షకులకు రీచ్ కావడానికి కొంత టైమ్ పడుతుందని ముందే అనుకున్నామని, ప్రభాస్ గారు కూడా ప్రశాంతంగా ఉండు డార్లింగ్, మనం కొత్త ప్రయత్నం చేశాం అని చెప్పినట్లు తెలిపారు. రీసెంట్ గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ప్రభాస్‌కు మెసేజ్ చేశానని, ఆ సీన్స్ అన్నీ పర్పెక్ట్‌గా సెట్ అయ్యాయని చెప్పినట్లు తెలిపారు. చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తే తన లైఫ్ సర్కిల్ ఫుల్ అయినట్లు భావిస్తానని చెప్పారు. తాను చిరంజీవి అభిమానిని అని చెప్పారు. ప్రేక్షకులు తమ రాజాసాబ్ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారని, తాను కూడా ప్రశాంతంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు చెప్పారు.
READ ALSO: Anil Ravipudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో చాలా షాకింగ్ థింగ్ ఇదే..: అనిల్ రావిపూడి
