NTV Telugu Site icon

Women Missing : భర్త వేధింపులు భరించలేక పరారైన వివాహిత

Women Missing : హైదరాబాద్.. జూబ్లీహిల్స్ లో ఓ వివాహిత అదృశ్యమైంది. కట్టుకున్న భర్త తరుచూ వేధిస్తుండడంతో ఆమె భరించలేకపోయింది. దీంతో ఆ వివాహిత కఠిన నిర్ణయం తీసుకుంది. కన్నబిడ్డలను వదిలి వెళ్లిపోయింది. పెళ్లై పదమూడు సంవత్సరాలుగా మారుతాడని భావించిన ఆమెకు నిరాశే ఎదురైంది. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

Read Also: Verity Tatto: కోపంలో భార్య.. ఆమె ముఖాన్ని టాటూ వేసుకున్న భర్త

జూబ్లీహిల్స్‌లోని గాయత్రిహిల్స్‌కు చెందిన అశ్విని, రామకృష్ణ దంపతులకు 13 సంవత్సరాలక్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అశ్వినినీ రామకృష్ణ తరచూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో వేధింపులు తాళలేక అశ్విని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే రామకృష్ణ అంతా వెతికినప్పటికీ అశ్విని జాడ తెలియలేదు. చివరకు బందువుల ఇంటికి కూడా వెళ్లలేదని తెలియడంతో రామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. తన భార్య కనిపించడం లేదంటూ రామకృష్ణ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అశ్విని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: Arjun Reddy: ఛీ ఛీ.. ఇలాంటి సినిమా చేసిందా.. అర్జున్‌రెడ్డిపై స్వప్న షాకింగ్ కామెంట్స్

Show comments