NTV Telugu Site icon

Morphing photos: వివాహిత ఫొటోలు మార్ఫింగ్.. భర్తకు పంపించిన ఓ దుర్మార్గుడు.. !

Photo Marphing

Photo Marphing

Morphing photos: వివాహిత ఫోటోలను మార్ఫింగ్ చేసి దుబాయిలో ఉన్న భర్తకు పంపించాడు ఓ దుర్మార్గుడు. సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్య విభేధాలు సృష్టించాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో బాధిత మహిళ దిశ SOS కు కాల్ చేసి న్యాయం చేయాలని ప్రాధేయపడింది. ఈ సంఘటన కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగింది.

Read Also: Uniform Civil Code: యూసీసీపై నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురానికి చెందిన అచ్చిరెడ్డి, బాధిత మహిళ మీనాను నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో వేధించేవాడు. అప్పట్లో అచ్చిరెడ్డి పై మీనా కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టను అని పెద్దల సమక్షంలో అచ్చిరెడ్డి హామీ ఇవ్వడంతో వివాదం ముగిసింది. కొన్ని నెలల తరువాత రావులపాలెంకు చెందిన పెద్దిరెడ్డికి మీనాను ఇచ్చి కుటుంబసభ్యులు వివాహం జరిపించారు. సంతోషంగా వీరి దాంపత్య జీవితం సాగింది. ఉద్యోగ రీత్యా కొన్ని రోజుల క్రితమే పెద్దిరెడ్డి దుబాయి వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అచ్చిరెడ్డి తిరిగి మీనాను వేధించడం మొదలుపెట్టాడు. గతంలో మీనాతో అచ్చిరెడ్డి దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా దుబాయ్ లో ఉన్న భర్తకే పంపించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టించాడు. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితురాలు దిశ SOS కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది.

Read Also: Bhatti Vikramarka: గెలుపు తీరాలకు చేర్చే చుక్కానిలా భ‌ట్టి.. పాదయాత్రతో పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్..!

బాధిత మహిళ దిశ SOS కు కాల్ చేసిన 8 నిమిషాల వ్యవధిలో రావులపాలెంలో ఉన్న లొకేషన్ కు పోలీసులు చేరుకున్నారు. వివాహిత ఫోన్ కు అచ్చిరెడ్డి పంపించిన బ్లాక్ మెయిల్ సమాచారం, ఫోటోలను, అసభ్యకరమైన సందేశాలను పోలీసులు సేకరించారు. మీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు అచ్చిరెడ్డి పై ఐపీసీ సెక్షన్ 354 D కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళ మీనాకు దిశ టీం భరోసా ను కల్పించి ధైర్యంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.