NTV Telugu Site icon

Married Couples Protest : పోలీసులు చర్య తీసుకుంటేనే పెళ్లి చేసుకుంటాం

Marr

Marr

Married Couples Protest : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లిని అట్టహాసంగా జరుపుకోవాలనుకుంటారు. బంధువులంతా తమ పెళ్లికి వచ్చి సందడి చేయాలని భావిస్తుంటారు. పిలిచిన వాళ్లలో ఏ ఒక్కరు తమ పెళ్లికి రాకపోయినా కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అందరి ఆశీర్వాదంతో నూతన జంట ఒక్కటవుతారు. కానీ మధ్యప్రదేశ్ లో కాసేపట్లో పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. పోలీసులు తమ సమస్య పరిష్కరిస్తే కానీ పెళ్లి చేసుకోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఇలా ఎందుకు జరిగింది.. ఇద్దరి మధ్యా ఏదో గొడవ జరిగిందనుకుంటున్నారా.. విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఓ పెళ్లి వేడుక మొదలైంది. ఓ వైపు పెద్దగా డీజే అదిరిపోతోంది. అందరూ డ్యాన్సులతో సందడి చేస్తున్నారు.

Read Also: Instagram Job Scam: ఒకే ఒక్క క్లిక్‎తో రూ.8.6లక్షలు స్వాహా.. ఉద్యోగం పేరుతో మోసం

కానీ అప్పుడే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ వేడుకలో పెట్టిన డీజే ఆపమని సూచించారు. పెళ్లివారు వినకపోయే సరికి పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇక పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. పోలీసులు పెళ్లి మండపం దగ్గర తమవారితో అనుచితంగా ప్రవర్తించారని.. పెళ్లి పందిరిలో నానా హంగామా చేశారంటూ కాబోయే దంపతులు ఆరోపించారు. పోలీసుల చర్యలు తీసుకునే వరకు తాము పెళ్లి చేసుకోబోమని ఆ జంట పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు మూడు గంటలు ధర్నా చేశారు. చివరికి పోలీసులు వారికి సర్ది చెప్పి హామీ ఇవ్వడంతో పెళ్లిజంట పెళ్లి చేసుకోవడానికి వేదిక వద్దకు చేరుకున్నారు. మొత్తానికి పోలీసుల వల్ల ఆగిపోయిన పెళ్లి జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.