Married Couples Protest : పోలీసులు చర్య తీసుకుంటేనే పెళ్లి చేసుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Married Couples Protest : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లిని అట్టహాసంగా జరుపుకోవాలనుకుంటారు. బంధువులంతా తమ పెళ్లికి వచ్చి సందడి చేయాలని భావిస్తుంటారు. పిలిచిన వాళ్లలో ఏ ఒక్కరు తమ పెళ్లికి రాకపోయినా కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అందరి ఆశీర్వాదంతో నూతన జంట ఒక్కటవుతారు. కానీ మధ్యప్రదేశ్ లో కాసేపట్లో పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. పోలీసులు తమ సమస్య పరిష్కరిస్తే కానీ పెళ్లి చేసుకోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఇలా ఎందుకు జరిగింది.. ఇద్దరి మధ్యా ఏదో గొడవ జరిగిందనుకుంటున్నారా.. విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో ఓ పెళ్లి వేడుక మొదలైంది. ఓ వైపు పెద్దగా డీజే అదిరిపోతోంది. అందరూ డ్యాన్సులతో సందడి చేస్తున్నారు.
Read Also: Instagram Job Scam: ఒకే ఒక్క క్లిక్‌తో రూ.8.6లక్షలు స్వాహా.. ఉద్యోగం పేరుతో మోసం
Also Read
కానీ అప్పుడే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ వేడుకలో పెట్టిన డీజే ఆపమని సూచించారు. పెళ్లివారు వినకపోయే సరికి పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇక పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. పోలీసులు పెళ్లి మండపం దగ్గర తమవారితో అనుచితంగా ప్రవర్తించారని.. పెళ్లి పందిరిలో నానా హంగామా చేశారంటూ కాబోయే దంపతులు ఆరోపించారు. పోలీసుల చర్యలు తీసుకునే వరకు తాము పెళ్లి చేసుకోబోమని ఆ జంట పోలీస్ స్టేషన్ ఎదుట దాదాపు మూడు గంటలు ధర్నా చేశారు. చివరికి పోలీసులు వారికి సర్ది చెప్పి హామీ ఇవ్వడంతో పెళ్లిజంట పెళ్లి చేసుకోవడానికి వేదిక వద్దకు చేరుకున్నారు. మొత్తానికి పోలీసుల వల్ల ఆగిపోయిన పెళ్లి జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!