Khammam Crime: పెళ్లి కుదిరే సమయంలో.. పెళ్లి జరిగే సమయంలో.. కొన్ని పట్టింపులు, మర్యాదల విషయంలో తరచుగా గొడవలు జరిగే సందర్భాలు చూస్తూనే ఉంటాం.. సరైన మర్యాద ఇవ్వడంలేదని.. నాన్‌వెజ్ పెట్టలేదని ఇలా కొన్ని ఘర్షణలకు కారణం అవుతుంటాయి.. తాజాగా.. ఖమ్మం జిల్లాలో ఓ పెళ్లి ఇంట్లో జరిగిన ఓ ఘర్షణతో.. ఇరు వర్గాలు బీరు బాటిళ్లు, కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది.. పోలీసులు కూడా తమ నుంచి కాదంటూ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కానీ, చివరకు ఊహించని ట్విస్ట్‌తో అంతా నోరువెల్లబెట్టారు.
Read Also: Supreme Court: వికలాంగ పిల్లల తల్లులకు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడాన్ని తిరస్కరించలేం..
పెళ్లికూతురు ఇంట్లో భోజనాలు సరిగా పెట్టలేదని.. మాంసం వడ్డించలేదని.. మర్యాద సరిగా చేయలేదని గొడవలు జరుగుతుంటాయి. కానీ, టీ పోయలేదని ఇరువర్గాలు గొడవ పడ్డ ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం ప్రకాష్ నగర్ కు చెందిన యువతికి చెరువుబజార్ కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. దీంతో పెళ్లి కూతురి ఇంటి వద్ద పూజలకు పెళ్లి కొడుకు తరపు బంధువులు వెళ్లారు. అయితే, అక్కడ వారికి టీ పోయలేదని చిన్న బుచ్చుకుని మనసులో పెట్టుకున్నారు. అనంతరం అందరూ భోజనాలు చేశాక ఊరేగింపులో నృత్యాలు చేస్తున్నారు. ఆ సమయంలోనే సాయంత్రం తమకు టీ పోయలేదని, మర్యాద చేయడం రాదంటూ వరుడి తరఫు వారు అలకబూనారు.. దానికి వధువు తరుపు బంధువులు ‘టీ ఎందుకు.. మీకు ఏకంగా మందు పోశాం.. భోజనాలు కూడా పెట్టాంగా అని గొడవకు దిగడంతో.. పరస్పరం దాడి చేసుకొని బీరు సీసాలతో కొట్టు కొట్టుకున్నారు.. ఈ ఘర్షణలో ఇద్దరి తలలు పగిలాయి, నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఖమ్మం త్రీటౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సర్దిచెప్పేందుకు యత్నించినా.. వారి ముందే కర్రలతో కొట్టుకుపోవడంతో పోలీసులు చేసేదేంలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.. ఇంతా జరిగాకా.. పెళ్లి ఎలా జరుగుతుందో అని బంధువులు అంతా ఆందోళన చెందారు. కానీ, ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పటంతో ప్రశాంతంగా పెళ్లి వేడుక ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..