NTV Telugu Site icon

Anna Rambabu: సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనన్నే రావాలి..

Anna Rambabu

Anna Rambabu

Anna Rambabu: ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని.. అవకాశం కల్పించండని, మీలో ఒక్కరిగా మీ అడుగుజాడల్లో నడుస్తూ మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తానని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. గురువారం కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం, ఉత్తరపల్లి, చెర్లోపల్లి, కుమ్మరపల్లి, చేరెడ్డిపల్లె, చిన్నారికట్ల, పెద్దారికట్ల గ్రామాల్లోని పలు వీధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగన్‌ పాలనలో అందించిన మంచిని వివరించారు. అనంతరం ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానమంత్రి మోడీ ఫోటో లేదన్నారు. మేనిఫెస్టో విడుదల సమయంలో బీజేపీ నాయకులు మేనిఫెస్టో పేపర్‌ను కూడా పట్టుకునేందుకు ఇష్టపడలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన పథకాలను కేంద్ర ప్రభుత్వమే నమ్మలేదన్నారు. ఇక ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలను అందించిన జగనన్ననూ మళ్లీ సీఎం చేసుకునేలా ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు. రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరారు. కులాలు, మతాలు అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలను అందించి పేదల మోములో చిరునవ్వులు పూయించిన జగన్‌ను రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే… పేదలందరికి మంచి జరగాలంటే… జగన్‌ను మళ్లీ సీఏం చేయాలన్నారు. పేదల ముంగిట్లోకి వచ్చిన సంక్షేమం, అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ జగన్‌ రావాలన్నదే మన ఆకాంక్ష అన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుకు మహిళలు పెద్దఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికారు.

ఓటు అనే ఆయుధంతో అవ్వాతాతలు రానున్న ఎన్నికల్లో జగనన్నను ఆశీర్వదించండని, రాష్టంలో పింఛన్‌దారులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని తరిమి కొట్టాలని ఆయన అన్నారు. పింఛన్ దారుల పడుతున్న ఇబ్బందులపై ప్రజలందరూ ఆలోచన చేయాలని కోరారు. 2019 నుంచి జగన్‌ సర్కారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసిందని ఆయన చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయన్నారు. వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులుగా టీడీపీ వారు ముద్ర వేశారన్నారు. వాలంటీర్ల ద్వారా నేరుగా పింఛన్ దారులు పింఛన్ పొందకూడదనే భావనతో చంద్రబాబు వారిని ఇబ్బందులకు గురిచేసి సమస్యలను సృష్టించారన్నారు అన్నా రాంబాబు. సచివాలయాల వద్ద పింఛన్ ఇచ్చే ప్రక్రియను చేపడితే దానిపై కూడా కోర్టులు, ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు చేసి అవ్వ తాతలు ఇబ్బందులు పడాలనే భావనతోనే ఆపేశారని ఆయన ఆరోపించారు. ఎండలను తట్టుకోలేని అవ్వా తాతలు 30 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలనే భావన తో వాలంటీర్ వ్యవస్థను జగనన్న తీసుకొచ్చారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ను రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎన్నికలు వచ్చే సరికి 10 వేలు జీతం ఇస్తామని, వారిని కొనసాగిస్తామని చెబుతూ మోసాలు, అబద్ధాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు జగన్‌కు, చంద్రబాబుకు ఉన్న తేడాను గమనించాలని అన్నా రాంబాబు ప్రజలను కోరారు.

 

Show comments