గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. మంగళవారం పొదిలి మండలంలోని ఓబులక్కపల్లి, కొండాయపాలెం, సలకనూతల, దొడ్లేరు, మూగచింతల, భట్టువారిపాలెం, మాదిరెడ్డిపాలెం, నందిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు ప్రజలను అభ్యర్థించారు. మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు.
Kavitha: కవితకు మళ్లీ ఎదురుదెబ్బ.. రెగ్యులర్ బెయిల్‌పై కోర్టు ఏం తేల్చిందంటే..!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కొనసాగాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని తెలిపారు. సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి కుటుంబం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మనసున్న ముఖ్యమంత్రి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఇందుకు ప్రతి మహిళా సహకరించాలని కోరారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి చేయలేని వారు.. నేడు ఎలా చేస్తారంటూ ప్రజలే ప్రశ్నించాలని కోరారు. జగనన్న సైనికునిగా.. మీ కోసం ఆహర్నిశలు ప్రజాక్షేమం కోసం పని చేసే తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల, టౌన్ కు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Delhi Liquor Scam: మద్యం కుంబకోణం కేసులో కీలక విషయాలు వెల్లడించిన ఈడీ