MLA KP Nagarjuna Reddy: అపర భగీరథుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆయనకు రైతుల తరుపున పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. మార్కాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు, 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే 50 సంవత్సరాల పశ్చిమ ప్రకాశం ప్రజలకల నెరవేరుస్తూ.. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసిన అపర భగీరథుడు సీఎం వైఎస్ జగన్‌కి ప్రజలందరూ, రైతుల తరుపున పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి చాలా వరకూ పూర్తిచేయగా.. 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును ఏటీఎం లాగా వాడుకుని వదిలేస్తే.. అధికారంలోనికి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని.. వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేసిన అపర భగీరథుడు అని అన్నారు. కరోనా రెండు సంవత్సరాల కాలాన్ని మిగిలిన రెండున్నరేళ్లలోనే వెలుగొండ ప్రాజెక్టు మొదటి, రెండవ టన్నెల్స్ పూర్తి చేశారని ప్రశంసలు కురిపించారు.
Read Also: YSRCP Rebel MLAs Letter: నోటీసులపై స్పందించిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌కు లేఖలు
కాగా, ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెలిగొండ కల సాకారం చేస్తూ.. రెండో టన్నెల్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.. రెండో సొరంగం తవ్వకం పనులు మంగళవారంతో ముగిసాయి.. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు 23వ తేదీన పూర్తి చేసినట్టు ఇంజీనీర్లు ప్రకటించారు.. ఇక, మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసింది ప్రభుత్వం.. రెండో టన్నెల్ పనులు ఈ రోజు పూర్తి కావడంతో.. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత సొంతం చేసుకుంది.. శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ఇప్పటికే పూర్తి చేశారు.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్ రిజర్వాయర్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తి చేశారు.. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు.. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని దాదాపు 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరాకు మార్గం సుగమం అయినట్టు అవుతుది.. మూడు జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది..