MLA KP Nagarjuna Reddy: రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA KP Nagarjuna Reddy: రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గడియార స్తంభం సెంటరులోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం డ్వాక్రా బజారులో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను సకాలంలో అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఆసరా ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు. నాలుగో విడత ఆసరా చెక్కులను అందజేశారు. అనంతరం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పెద్దఎత్తున మహిళలు పాల్గొని థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, వైస్ ఛైర్మన్లు షేక్ ఇస్మాయిల్, అంజమ్మ శ్రీనివాసులు, కమిషనర్ రవీంద్ర, డీఎల్డీఓ సాయికుమార్, కౌన్సిలర్లు దొడ్డ భాగ్యలక్ష్మి, హర్షిత, కోఆప్షన్ మెంబర్ వనజాక్షి, నాయకులు శ్రీనివాసులు, ఉత్తమ్, కాటమయ్య, బాషా, మెప్మా సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
Read Also: Janasena: జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత!
Also Read
మరోవైపు.. మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డిని యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంఛార్జి తాడిపత్రి చంద్రశేఖర్ శనివారం మార్కాపురంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. చంద్రశేఖర్ ఇటీవలే వై.పాలెం ఇన్‌ఛార్జిగా నియమితులైన సందర్భంగా మొదటిసారిగా ఎమ్మెల్యేను కలిశారు. మాజీ జడ్పీటీసీ డి. వెంకటరెడ్డి, ఎంఎన్ రెడ్డి, తదితరులున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!