NTV Telugu Site icon

KP Nagarjuna Reddy: వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి

Kp Nagarjuna

Kp Nagarjuna

మార్కాపురం నియోజక వర్గంలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో శాసన సభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిదులతో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. నాలుగన్నర సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ సమక్షంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు అని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ఉంటూ మన ఆత్మగౌరవాన్ని పెంచారు.. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పేద ప్రజల ఆత్మగౌరవం పెంచిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే అని కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు.

Read Also: North Korea: సైనిక గూఢచార ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఉత్తర కొరియా.. రష్యా సాయం.?

ఇక, కలుజువ్వలపాడు సచివాలయం పరిధిలో 14 వందల ఇళ్లు ఉన్నాయని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ 14 వందల ఇళ్లకు 8, 652 సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సచివాలయ సిబ్బంది ఇప్పటి వరకు 1393 ఇళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.. 7 ఇళ్లు మినహా అందరికీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి.. దాదాపు 98 శాతం మన ప్రభుత్వ నిధులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నాకు తెలిసి.. ఏపీలో ప్రజలకు సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు అని ఎమ్మెల్యే కేపీ అన్నారు.

Read Also: ODI World Cup 2027: ముగిసిన 2023 వరల్డ్ కప్.. తర్వాతి ప్రపంచకప్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ ను మరోసారి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వధించాలని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది.. గత నాలుగున్నర సంవత్సరాలుగా నేను కూడా అందరికి అందుబాటులో ఉన్నాను.. మార్కాపురంలో అభివృద్ది్కి నా వంతు కృషి చేశాను అని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి పనిలో ప్రభుత్వం తోడ్పుతో ప్రజలకు నిరంతరం సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది అని కేపీ నాగార్జున రెడ్డి చెప్పుకొచ్చారు.