Site icon NTV Telugu

Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!

Harikrishna

Harikrishna

Markapuram Bus Fire Accident: మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయనే బస్సును నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Reliance Industries: పాపం అంబానీ.. ఒక్కరోజులో రూ.82 వేల కోట్లు లాస్! కారణం ఇదే..

ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుని 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే హరికృష్ణ రెడ్డి బస్సు నుంచి దూకి పరారైనట్లు సమాచారం. అనంతరం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అతన్ని కనిగిరి వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హరికృష్ణ రెడ్డి మార్కాపురం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనను సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు కేసుపై ముమ్మరంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇక నిందితుడిని ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Wife Kills Husband: రోకలిబండతో కొట్టి భర్తను మట్టుబెట్టిన భార్య.. ఇంటిముందే పాతిపెట్టి..?

Exit mobile version