Site icon NTV Telugu

BRS: వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్..

Marepalli Sudhir Kumar

Marepalli Sudhir Kumar

BRS: వరంగల్‌ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. మొదటి నుంచి ఈ టికెట్‌ స్టేషన్ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఖరారయ్యిందని, ఈ మేరకు రాజయ్యకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి పిలుపు వచ్చిందని ఇవాళ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో మార్పు చోటుచేసుకుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

Read Also: Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్షపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ కి విధేయుడుగా, అధినేత తో కలిసిపనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. ఇక వరంగల్‌ బీఆర్‌ఎస్ ఎంపీ టికెట్ మొదట కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంపీ టికెట్‌ను మారేపల్లి సుధీర్‌కుమార్‌కు ఇచ్చారు.

Exit mobile version