NTV Telugu Site icon

Bharat Bandh: రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు..

Bharath Bandhu

Bharath Bandhu

Maoists: మావోయిస్టులు రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. దండ కారణ్యాన్ని భద్రత బలగాలతో జల్లెడ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో మావోయిస్టులు విధ్వసం సృష్టించారు. అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో వీరాపురం దగ్గర వాహనాలపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. కార్లకు నిప్పు పెట్టారు. రేపు తాము ఇచ్చిన భారత్ బంద్ పిలుపుని విజయవంతం చేయాలంటూ కరపత్రాలను మావోయిస్టులు వదిలి వెళ్లారు. అయితే మావోయిస్టుల డిమాండ్స్ పై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు..

Read Also: Hyderabad: ప్రాణం తీసిన పాత కక్షలు.. కులుసుంపుర పరిధిలో దారుణ హత్య

అయితే, నిన్న ( బుధవారం ) పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో 8 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి నిరసనగా రేపు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచినట్లు టాక్ వినిపిస్తుంది. ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులకు- పోలీసులకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిథిలోని దండకారణ్యంలో మావోయిస్ట్ బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో మావోయిస్టుల సామాగ్రిని, పేలుడు పదార్ధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు ఎనిమిది మంది మావోయిస్టులను చంపేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.