Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి తెగబడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో గ్రామస్థుడిని గొంతు కోసి మావోయిస్టులు హత్య చేశారు. మృతుడు భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేర్ గ్రామానికి చెందిన కుమ్మేష్ కుంజమ్‌గా గుర్తించారు. గ్రామస్తుడిని అర్థరాత్రి గొంతు కోసి హత్య చేసి. ఆ తర్వాత మృతదేహాన్ని చితక టిండోడి రోడ్డుపై పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. భైరామ్‌ఘఢ్ ఏరియా కమిటీ జారీ చేసిన కరపత్రాన్ని సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Read Also: CM Revanth Reddy: గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ సమీక్ష