ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోలను ఏరివేసేందుకు భద్రతా దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. మూడు రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక ఆపరేషన్ తో వణికిపోయిన మావోలు కర్రెగుట్ట ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని వేడుకున్నారు. మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రకటన విడుదల…