Venugopal Rao: మావోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో సీపీఐ (మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను తనతో పాటు 60మంది మావోయిస్టు కేడర్లు ఆయుధాలు వదిలి లొంగిపోయారు. దండకారణ్య ప్రాంతంలో కీలక పాత్ర పోషించిన సోను లొంగిపోవడంతో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా బలహీనపడినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గత సెప్టెంబర్‌లో సోను ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, తాను మావోయిస్టు మార్గాన్ని వదిలి జనస్రవంతిలోకి రావాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. పార్టీ నాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, సిద్ధాంత విరుద్ధ విధానాలు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, సాయుధ పోరాటం ప్రజల ప్రయోజనాలకు అనుకూలం కాదని పేర్కొన్నాడు.
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు..
సోను నిర్ణయానికి ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోని అనేకమంది మావోయిస్టు కేడర్లు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అధికారులు ఈ లొంగుబాటును మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో ఒక కీలక మలుపుగా పరిగణిస్తున్నారు. దీంతో మధ్య భారతదేశంలో మావోయిస్టు ప్రభావం మరింత తగ్గుతుందని భావిస్తున్నారు. లొంగిపోయిన వారిపై పునరావాస చర్యలకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రభుత్వం ప్రకటించనుంది.
Viral Video: తాకరాని చోట తాకిన బంతి.. అల్లాడిపోయిన కేఎల్ రాహుల్!
