Microsoft Windows outage: గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యం
- గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యం
- మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల నిలిచిపోయిన సర్వర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Microsoft Windows outage: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సర్వర్లు నిలిచిపోయాయి. దీనివల్ల పలు విమాన సర్వీసులు ఆలస్యం కాగా.. బోర్డింగ్ పాసులపై మాన్యువల్‌గా రాసి ప్రయాణికులను పంపిస్తున్నారు. రోజుకు గన్నవరం నుండి 23 విమాన సర్వీసులు వివిధ ప్రదేశాలకు బయలుదేరి వెళ్లవలసి ఉన్నాయని గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఏకే లక్ష్మీకాంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Ashwini Vaishnaw: మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయంపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే..?
Also Read
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
ఇప్పటి వరకు 13 విమాన సర్వీసులు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లగా.. 7 విమాన సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లాయని ఆయన వెల్లడించారు. ఇదే ఆలస్యం సాయంత్రం వరకు కొనసాగితే ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. క్లౌడ్ సర్వర్, మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం వల్ల ఉదయం నుంచి కొన్ని విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని.. ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలలో విమాన సర్వీసులకు ఇదే పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని వస్తున్న విమానయాన ప్రయాణికులకు, మాన్యువల్‌గా బోర్డింగ్ పాసులు ఇస్తున్నామన్నారు.
గన్నవరం విమానాశ్రయంలో టికెట్ కౌంటర్లో ప్రయాణికులకు టికెట్లు నిలిపివేశామని.. ఇదే సమస్య రెండు మూడు రోజులు కొనసాగితే, విమాన సర్వీసులు నడపడం కష్టమన్నారు. క్లౌడ్ మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం త్వరితగతిన పునరుద్దించాలని కోరుకుంటున్నామని గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఏకే లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
-
Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
-
AR Rahman: అల్మారలో దాచుకున్న అవార్డుల గురించి ఆలోచిస్తే లాభం లేదు!
-
AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
-
Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!