Site icon NTV Telugu

IAS Transfers: ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ

Ap Govt

Ap Govt

IAS Transfers: ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా శశిభూషన్ కుమార్ బదిలీ అవ్వగా, బుడితి రాజశేఖర్‌ను జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ రాజ్‌ కమిషనర్‌గా కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్‌గా సూర్యకుమారిలను బదిలీ చేసింది. పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ, ఏపీ టూరిజం సీఈఓగా కన్నబాబుకు అదనపు బాధ్యతలను అప్పగించింది.

కె.హర్షవర్ధన్‌కు మైనారిటీ సంక్షేమశాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది. సెర్ప్ సీఈఓగా మురళీధర్ రెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు సీసీఎల్ఏ, సీసీఎల్ఏ కార్యదర్శిగా వెంకటరమణా రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది ఏపీ సర్కారు.

Exit mobile version