Manvanth Kumar: రంజీ ట్రోఫీ 2026-27లో కర్ణాటక ఆల్‌రౌండర్ మన్వంత్ కుమార్ అదరగొట్టాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 22 ఏళ్ల మన్వంత్ కుమార్ ఏకంగా 135 పరుగులు చేసి తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీని నమోదు చేశాడు. ఒక దశలో కర్ణాటక 187/7తో ఉండగా క్రీజులోకి వచ్చిన మన్వంత్ వచ్చాడు. కొద్దిసేపటికే జట్టు 194/8కి చేరడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా దూకుడుగా ఆడిన అతడు సౌరాష్ట్ర బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 213 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 135 పరుగులు చేశాడు.
ముఖ్యంగా సౌరాష్ట్ర సీనియర్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో మన్వంత్ కొట్టిన రెండు సిక్సర్లు అబ్బురపరిచాయి. అలాగే ఎడమచేతి స్పిన్నర్ పార్థ్ భూత్ బౌలింగ్‌లోనూ మూడు సిక్సర్లు బాదాడు. 65 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మన్వంత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరుసటి రోజు తన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలిచాడు. మన్వంత్ కుమార్‌కు మరో ఎండ్‌లో అభిలాష్ శెట్టి అద్భుత సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో 194/8తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కర్ణాటక చివరకు 342 పరుగుల స్కోరు సాధించింది.
మన్వంత్ కుమార్ కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ సత్తా చాటగల ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అతడు కుడిచేతి మీడియం పేస్ బౌలింగ్ చేస్తాడు. కర్ణాటక వయో విభాగ క్రికెట్‌లో ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్నాడు. గత సీజన్‌లో కర్ణాటక అండర్-23 జట్టు తరఫున 50 ఓవర్ల స్టేట్ ఏ ట్రోఫీలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. రెండేళ్ల క్రితం సీకే నాయుడు ట్రోఫీ ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌పై కర్ణాటక విజయంలోనూ మన్వంత్ కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసుకున్నాడు. 2026 మహారాజా ట్రోఫీలోనూ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 204.17 స్ట్రైక్‌రేట్‌తో 147 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ, 13 సిక్సర్లు ఉన్నాయి.
2024లో కర్ణాటక తరఫున టీ20 అరంగేట్రం చేసిన మన్వంత్.. గతేడాది లిస్ట్-A క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2025 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. 2026 సీజన్‌కు ముందు అతడిని ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఇక గత వారం ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన మన్వంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
Meet Karnataka’s new fast bowling all rounder – Manvanth Kumar arriving at FC stage in his very second match with a sensational 135 when team was struggling at 187/7🔥
#RanjiTrophy #KARvSAU https://t.co/ZN095P5kqu— Karnataka Sports Fans (@karnataka_sport) October 19, 2026

