Site icon NTV Telugu

Manushi Chhillar: ఆ పాత్ర కోసం ముందుగా నన్నే అడిగారు.. విషయం తెలియక రిజక్ట్‌ చేశా!

Manushi Chhillar

Manushi Chhillar

Manushi Chhillar Said Rashmika Mandanna’s Role in Animal: తెలుగు హిట్ సినిమా అర్జున్‌ రెడ్డికి రీమేక్‌గా హిందీలో తెరకెక్కిన ‘కబీర్‌ సింగ్‌’లో ప్రీతి పాత్ర కోసం చిత్ర యూనిట్ ముందుగా తననే సంప్రదించిందని మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్‌ తెలిపారు. షాహిద్‌ కపూర్ మూవీలో హీరోయిన్‌ ఛాన్స్‌ వచ్చిందనే విషయం తెలియక తాను రిజక్ట్‌ చేశానన్నారు. యానిమల్‌ సినిమాలో రష్మిక మందన్న బాగా యాక్టింగ్‌ చేశారని మానుషి ప్రశంసించారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో మానుషి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మానుషి చిల్లర్‌ ప్రస్తుతం ‘బడే మియా ఛోటే మియా’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విషయాలపై స్పందించారు. ‘కబీర్‌ సింగ్‌లో ప్రీతి పాత్ర కోసం చిత్ర యూనిట్ తొలుత నన్నే సంప్రదించింది. షాహిద్‌ కపూర్ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్‌ వచ్చిందనే విషయం తెలియక రిజక్ట్‌ చేశా. ఆ సమయంలోనే నేను మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుపొందా. ఏడాది పాటు ఆ బృందంతో కాంట్రాక్ట్‌ ఉండే. అది కూడా సినిమా చేయకపోవడానికి ఓ కారణం’ అని మానుషి చిల్లర్‌ తెలిపారు. కబీర్‌ సింగ్‌లో కియారా అద్వానీ నటించిన విషయం తెలిసిందే.

Also Read: BCCI: ‘ఇంపాక్ట్‌’ రూల్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమే: బీసీసీఐ

‘సందీప్‌ రెడ్డి వంగా సినిమాలు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన సినిమాల్లో నాకు నటించాలని ఉంది. ఇటీవల యానిమల్‌ మూవీ చూశా. రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర నాకు బాగా నచ్చింది. కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడింది. యానిమల్‌లో రష్మిక నటన సూపర్. నటిగా నన్ను సవాలు చేసే అలాంటి పాత్రలు నాకు చేయాలనుంది’ అని మానుషి చిల్లర్‌ చెప్పుకొచ్చారు. 2017లో మానుషి ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నారు.

Exit mobile version