ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు రాక ఎక్కువైంది.. అందులో కొందరు హీరోయిన్లు మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను అందుకుంటే.. మరికొందరు మాత్రం ఫస్ట్ మూవీతో తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు చెయ్యలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ ను ఎప్పుడు పలకరిస్తూనే ఉన్నారు.. తాజాగా వరుణ్ తేజ్ బ్యూటీ కూడా సోషల్ మీడియా రచ్చ చేస్తుంది.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో నటించిన ముద్దుగుమ్మ మానిషి చిల్లర్..
ఈ అమ్మడు గురించి పరిచయాలు అవసరం లేదు.. ‘మిస్ వరల్డ్’ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ ఏడాది విడుదలైన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. మిస్ వరల్డ్ గా అందరిని ఆకట్టుకుంది.. కానీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేక పోయింది.. బాలీవుడ్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటంచిన యాక్షన్ ఎంటర్‌టైనర్ బడే మియాన్ ఛోటే మియాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
ఆ సినిమాలో పాప అందాలకు జనాలు కనెక్ట్ అయ్యారు కానీ సినిమా హిట్ టాక్ ను అందుకోలేదు.. బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉంది.. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా గార్జియస్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. లాంగ్ డ్రెస్సులో దేవకన్య లాగా ఉండే ఫోటోలను షేర్ చేసింది.. ఆ డ్రెస్సులో అమ్మడు అందాలు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం ఈ ఫోటోలు లైకులు, కామెంట్లతో ట్రెండ్ అవుతున్నాయి.. మీరు ఒక ఒక లుక్ వెయ్యండి..